Viral Pic : 22 ఏళ్ల క్రితం Dia Mirza, Lara Dutta, Priyanka Chopra,

తన ‘మిస్ ఇండియా’ రోజులకు సంబంధించిన ఓ పాత ఫోటోని దియా మీర్జా సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, అందులో ఆమెతో పాటూ లారా దత్తా, ప్రియాంక చోప్రా కూడా ఉండటమే అసలు విశేషం!


‘‘2000వ సంవత్సరపు అలనాటి జ్ఞాపకం...’’ అంటూ దియా షేర్ చేసిన ‘బ్యూటీ క్వీన్స్ పిక్’ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతే కాదు, ఫోటోలో దియా మీర్జాతో పాటూ ఉన్న లారా కూడా తమ త్రోబ్యాక్ పిక్‌పై కామెంట్ చేసింది. ‘‘గుండెల నిండా కలల్ని నింపుకున్న ముగ్గురు అమ్మాయిలు... ఒకరికి అండగా మరొకరు’’ అంది.

2000 నాటి... 22 ఏళ్ల రేర్ పిక్ ఇప్పుడు నెటిజన్స్‌లో పలు చర్చలకు కారణం అవుతోంది. అప్పట్లో ‘మిస్ ఇండియా’ కాంపిటీషన్స్‌కు హాజరైన దియా, లారా, ప్రియాంక ముగ్గురూ అంతర్జాతీయంగా తమ అందంతో ఆహా అనిపించారు. ప్రియాంక మిస్ వరల్డ్‌గా చరిత్ర సృష్టించి తరువాత బాలీవుడ్‌లో సత్తా చాటి ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ తానేంటో నిరూపించుకునే పనిలో ఉంది. లారా దత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికై బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతిని పెళ్లాడింది. ప్రస్తుతం పర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలతో వెబ్ సిరీస్‌లలోనూ అలరిస్తోంది. ఇక మన హైద్రాబాదీ బ్యూటీ క్వీన్ దియా మీర్జా రెండు దశాబ్దాల క్రితం మిస్ ఏషియా పసిఫిక్ అందాల కిరీటం స్వంతం చేసుకుంది. నటిగా ఆశించినంత విజయం దక్కకున్నా ఈ మధ్యే వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది... 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.