షూటింగ్ కోసం ఖర్దుంగ్‌లా కు బైక్‌‌పై చేరుకున్న కథానాయికలు

ABN , First Publish Date - 2022-06-29T21:43:13+05:30 IST

కథానాయికలే ప్రాధాన్యంగా రూపొందుతున్న సినిమా ‘‘ధక్ ధక్’’(Dhak Dhak). తాహిరా కశ్యప్ (Tahira Kashyap) దర్శకత్వం వహిస్తున్నారు. వెటరన్ నటి రత్నపాఠక్ షా (Ratna Pathak Shah), దియా

షూటింగ్ కోసం ఖర్దుంగ్‌లా కు బైక్‌‌పై చేరుకున్న కథానాయికలు

కథానాయికలే ప్రాధాన్యంగా రూపొందుతున్న సినిమా ‘‘ధక్ ధక్’’(Dhak Dhak). తాహిరా కశ్యప్ (Tahira Kashyap) దర్శకత్వం వహిస్తున్నారు. వెటరన్ నటి రత్న పాఠక్ షా (Ratna Pathak Shah), దియా మీర్జా(Dia Mirza), ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh), సంజన సంఘీ(Sanjana Sanghi) కీలక పాత్రలు పోషిస్తున్నారు. వయాకాం 18 స్టూడియోస్, బీఎల్ఎమ్ పిక్చర్స్‌తో కలసి తాప్సీ పన్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఖర్దుంగ్ లాలో జరుగుతుంది. అందుకోసం కథానాయికలు ఢిల్లీ నుంచి ఖర్దుంగ్ లాకు బైక్ పై చేరుకున్నారు. 


దియా మీర్జా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మేం ఈ పనిని చేయగలమా.. నిజంగా దీనిని సాధించగలమా అని నేను అనుకున్నాను. కానీ, మేం సాధించాం. ‘ధక్‌ ధక్’ ను చూసినప్పుడు ఈ ప్రయాణం మాకు ఎంత ముఖ్యమో మీరు తెలుసుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఖర్దుంగ్‌లా‌కు బైక్ రైడ్ చేసిన చిత్ర బృందంగా మేం సంబరాలు చేసుకుంటున్నాం. ‘ధక్‌ ధక్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాను’’ అని దియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దియా పెట్టిన పోస్ట్‌కు తాప్సీ రిప్లై ఇచ్చారు. ఛాంపియన్స్ అని కామెంట్ చేశారు. కొన్ని రోజుల క్రితం దియా మీర్జా ‘ధక్ ధక్’ సెట్స్ నుంచి కొన్ని చిత్రాలను సోషల్ వేదికలో పంచుకున్నారు. లఢక్‌ కొండ ప్రాంతాల నుంచి ఆ పిక్స్ పోస్ట్ చేశారు. ‘‘ఈ సినిమా జీవితంలోనే ఓ అనుభవం. ఈ మూవీ సెట్‌లో గడిపిన ప్రతి క్షణం మధరమైనది. అందుకు గర్విస్తున్నాను’’ అని దియా తెలిపారు. ఇక కెరీర్ విషయానికి వస్తే..దియా మీర్జా ప్రస్తుతం ‘భీడ్’ లో కీలక పాత్ర షోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 



Updated Date - 2022-06-29T21:43:13+05:30 IST