Dia Mirza: తాన్యా కకడే మృతికి నటి సంతాపం.. పైలోకాలను వెలుగుతో నింపాలంటూ..

Twitter IconWatsapp IconFacebook Icon
Dia Mirza: తాన్యా కకడే మృతికి నటి సంతాపం.. పైలోకాలను వెలుగుతో నింపాలంటూ..

కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ సవతి కూతురు తాన్యా కకడే (Tanya kakade) ఆగస్టు 1న శంషాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాన్య తన స్నేహితులతో కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నగరంలోకి వెళుతుండగా ఆమె కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారందరికీ గాయాలు కాగా.. తాన్య అక్కడికక్కడే మృతి చెందింది.


ఈ హృదయ విదారక వార్త చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 25 ఏళ్ల తాన్యా కకడేకి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపుతూ చాలామంది పోస్టులు పెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) సైతం తాన్యకి సంతాపం తెలిపింది.. దియా మీర్జాకి తాన్య వరుసకి కూతురు అవుతుంది. దియా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో.. ‘నా అక్క కూతురు. నా బిడ్డ. నా స్నేహితురాలు. వెలుగులో కలిసిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్న శాంతిని, ప్రేమని పొందాలని ఆశిస్తున్నా. నువ్వు మా హృదయాలకు నవ్వుని అందించావు. నీ నృత్యం, నవ్వు, పాటతో పై లోకాలు మరింత కాంతితో ప్రజ్వరిల్లుతాయని ఆశిస్తున్నా. ఓం శాంతి’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టుపై స్పందిస్తూ బాలీవుడ్ ప్రముఖులు సైతం నివాళి అర్పిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.


తాన్యా కకడే ఎవరు?

తాన్యా కకడే ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.  హైదరాబాద్‌కి చెందిన వర్థమాన మేకప్ ఆర్టిస్ట్. ఆమె పెళ్లికూతుళ్ల అలంకరణ ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ డిజైన్ వీక్ వంటి వివిధ ఫ్యాషన్ షోలకి పనిచేసింది. రీతూ వర్మ, హెబ్బా పటేల్, దియా మీర్జా వంటి పలువురు తెలుగు, తమిళ సినీ తారలకు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసింది. అంతేకాకుండా.. కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్‌కి సవతి కూతురు అవుతుంది.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.