ఇండోనేషియన్ భాషలోనూ ‘దృశ్యం’ రీమేక్

ABN , First Publish Date - 2021-09-18T20:25:10+05:30 IST

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ ఏ స్థాయిలో హిట్టయిందో తెలిసిందే. 2013 లో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్ లో ఆ ఏడాది హైయస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇండోనేషియన్ భాషలోనూ ‘దృశ్యం’ రీమేక్

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ ఏ స్థాయిలో హిట్టయిందో తెలిసిందే. 2013 లో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్ లో  ఆ ఏడాది హైయస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ దాదాపు ఘనవిజయం సొంతం చేసుకుంది దృశ్యం. అంతేకాదు .. ఈ సినిమాను సింహళ, చైనీస్ భాషల్లో సైతం రీమేక్ చేయగా.. ఆ సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ‘దృశ్యం’ సినిమాకి  మరో విశేషం కూడా యాడైంది. ఈ సినిమాను ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 




ఫాల్కన్ నిర్మాణ సంస్థ ‘దృశ్యం’ రీమేక్ హక్కుల్ని దక్కించుకొని ఇండోనేషియా స్థానిక భాషలో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించింది. హీరో, దర్శకుడు, ఇంకా కేస్టింగ్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇండోనేషియా స్థానిక భాష బహాసా ఇండోనేషియా. అక్కడ జనాభాలో 94 శాతం ప్రజలు ఈ భాషనే మాట్లాడతారు. అందుకే ఈ సినిమాను ఆ భాషలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక దృశ్యం రెండో భాగం సైతం సూపర్ హిట్టవడంతో.. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా రీమేక్ పనులు పూర్తయ్యాయి. ఇతర భాషల్లో సైతం ఈ సినిమాను రీమేక్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మరి దృశ్యం రెండో భాగం కూడా మొదటి భాగం రీమేక్ అయిన అన్నీ భాషల్లోనూ రీమేక్ అవుతుందేమో చూడాలి. 

Updated Date - 2021-09-18T20:25:10+05:30 IST