‘సాంబ’ కథ ఏంటి?

ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST

సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి జంటగా రూపుదిద్దుకొన్న ‘ధగడ్‌ సాంబ’ చిత్రం..

‘సాంబ’ కథ ఏంటి?

సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి జంటగా రూపుదిద్దుకొన్న ‘ధగడ్‌ సాంబ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా గురించి దర్శకుడు ఎన్‌.ఆర్‌.రెడ్డి మాట్లాడుతూ ‘కామెడీ, యాక్షన్‌ అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సరికొత్త సంపూని ఈ సినిమాలో చూస్తారు’ అని చెప్పారు. చిత్ర సమర్పకుడు బి.ఎస్‌.రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని పాటలకోసం అద్భుతమైన సెట్స్‌ వేశాం. సంపూర్ణేష్‌బాబు స్టెప్స్‌, సోనాక్షి గ్లామర్‌ అలరిస్తాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ‘ఇప్పటివరకూ  చేసిన సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయానే అనే చిన్న బాధ నాలో ఉంది. ఈ సినిమా మాత్రం అందర్నీ అలరిస్తుందనే  నమ్మకం ఉంది’ అన్నారు సంపూ. ఈ చిత్రానికి ఆర్‌.ఆర్‌. నిర్మాత.

Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST