సూపర్ స్టార్ సూపర్ కారు... 18 వేలు!

ABN , First Publish Date - 2021-10-12T03:03:04+05:30 IST

కార్ అంటే కేవలం వాహనం మాత్రమే కాదు. అది సక్సెస్‌కి సగర్వ సంకేతం కూడా! అందుకే, చాలా మంది తమ జీవితంలో కష్టపడి కొనుక్కున్న తొలి కారుని అంత తేలిగ్గ అమ్మరు.

సూపర్ స్టార్ సూపర్ కారు... 18 వేలు!

కార్ అంటే కేవలం వాహనం మాత్రమే కాదు. అది సక్సెస్‌కి సగర్వ సంకేతం కూడా! అందుకే, చాలా మంది తమ జీవితంలో కష్టపడి కొనుక్కున్న తొలి కారుని అంత తేలిగ్గ అమ్మరు. ఇందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర కూడా అతీతుడు కాదు. దశాబ్దాల పాటూ హిందీ సినిమా రంగాన్ని ఏలిన ‘హీ-మ్యాన్’ తాజాగా తన అలనాటి కారుని నెటిజన్స్ ముందుకు తీసుకొచ్చారు. 


ధర్మేంద్ర తన జీవితంలో స్వంతం చేసుకున్న తొలి కారు... బ్లాక్ ఫియట్. అప్పట్లో దాని ధర 18 వేలట! 

‘‘ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. నేను నా కార్‌ని ఇప్పటి దాకా జాగ్రత్తగా చూసుకున్నాను’’ అన్నారు సీనియర్ యాక్టర్. అంతే కాదు, ఆయన తన సొషల్ మీడియా అకౌంట్లో ‘‘నా తొలి కారుకి నా గుండెలో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’ అని కూడా రాశారు! ధర్మేంద్ర వింటేజ్ కార్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది... 


Updated Date - 2021-10-12T03:03:04+05:30 IST