Dhanush: శేఖర్ కమ్ములతో సినిమాను పట్టాలెక్కించనున్న హీరో.. హీరోయిన్ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-10-08T23:04:09+05:30 IST

విభిన్న సినిమాలు, వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

Dhanush: శేఖర్ కమ్ములతో సినిమాను పట్టాలెక్కించనున్న హీరో.. హీరోయిన్ ఎవరంటే..

విభిన్న సినిమాలు, వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తాజాగా టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సార్’ (Sir) లో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో చిత్రం రూపొందుతుంది. ధనుష్ ‘సార్’ కు ముందే శేఖర్ కమ్ముల (Sekhar Kammula)తో సినిమా చేయాలి. ఏమైందో తెలియదు కానీ, ఆ చిత్రం మాత్రం ఆగిపోయింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.  


ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller)లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ షూటింగ్‌ను డిసెంబర్ చివరి వారానికి పూర్తి చేయాలని ధనుష్ భావిస్తున్నాడట. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే శేఖర్ కమ్ములతో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రం పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. 1950ల నేపథ్యంలో కథ కొనసాగబోతున్నట్టు సమాచారం. మద్రాసులో పుట్టిన తెలుగు యువకుడి పాత్రలో ధనుష్ కనిపించనున్నట్టు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించనుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇక ధనుష్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా హాలీవుడ్ ప్రాజెక్టు ‘ది గ్రే మ్యాన్’ లో నటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. ‘కెప్టెన్ మిల్లర్’ 1930-40 ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీని టి త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవణన్, సాయి సిద్దార్థ నిర్మాతలు. జీవీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. 


Updated Date - 2022-10-08T23:04:09+05:30 IST