దళపతి విజయ్ విలన్‌గా Dhanush ?

Twitter IconWatsapp IconFacebook Icon
దళపతి విజయ్ విలన్‌గా Dhanush ?

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం తర్వాత దక్షిణాదిన మల్టీస్టారర్స్‌కు మళ్ళీ ఊపొచ్చింది. ఒకే స్ర్కీన్‌పై ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల్ని చూపించడానికి బడా దర్శకులందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి చిత్రాల్లో విలన్స్‌గా నటించడానికి క్రేజీ స్టార్ హీరోలు సైతం వెనుకాడడం లేదు. ఇటీవల లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో కమల్‌హాసన్ (Kamalhaasan) హీరోగా విక్రమ్ (Vikram) సినిమా ఈ ఫార్ములాతోనే హైయస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. కమల్ తో పాటు తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) స్ర్కీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి విలన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్ చిత్రంలో సెకండ్ హీరోగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇదే ఫార్ములాను దర్శకుడు లోకేష్.. తన తదుపరి చిత్రానికి కూడా అప్లై చేయడానికి రెడీ అవుతుండడం విశేషం.


లోకేశ్ కనగరాజ్ తదుపరి చిత్రాన్ని దళపతి విజయ్‌తో చేయబోతున్నట్టుగా ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘మాస్టర్’ (Master) అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాట విజయ్ కెరీర్ లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అందుకే లోకేష్ తో మరో సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ కు విలన్‌గా ధనుష్‌ (Dhanush) ను ఎంపిక చేయబోతున్నట్టు టాక్. ఇప్పటికే ధనుష్ కు కథ వినిపించగా.. అతడికి బాగా నచ్చిందట. దాంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. ఆల్రెడీ ‘ఖైదీ 2’ (Khaidi 2) లో అన్నదమ్ములు కార్తి (Karthi), సూర్య (Surya) లను ప్రత్యర్ధులుగా దింపడానికి రెడీ అయిన లోకేష్.. ఇప్పుడు విజయ్, ధనుష్‌లను‌ శత్రువులుగా మార్చి అభిమానులకు పూనకాలు తెప్పించబోతున్నాడన్నమాట. మరి నిజంగానే విజయ్ కు విలన్ గా ధనుష్ మారతాడో లేదో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.