Dhanush - Sekhar kammula combo : వచ్చే ఏడాది సెట్స్‌పైకి?

Twitter IconWatsapp IconFacebook Icon
Dhanush - Sekhar kammula combo : వచ్చే ఏడాది సెట్స్‌పైకి?

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ (Dhanush).. తెలుగులో డైరెక్ట్ గా నటిస్తున్న చిత్రం ‘సార్’ (Sir). వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. అయితే ఇంతకు ముందే ధనుష్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరో అప్డేట్ రాలేదు. దాంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా లేదా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇటీవల పూర్తి కథను ధనుష్‌కు వినిపించారట. దానికి ధనుష్ ఎంతో ఇంప్రెస్ అయి.. వెంటనే సినిమాను మొదలు పెడదామని చెప్పాడట. 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల టీమ్ స్ర్కిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారట. ‘ఫిదా (Fida), లవ్‌స్టోరీ (Lovestory)’ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకొని మంచి ఫామ్‌లో ఉన్న శేఖర్ కమ్ముల.. ధనుష్ కోసం ఒక అదిరిపోయే కథాంశాన్ని రెడీ చేశారట. ధనుష్ గతంలో నటించిన ‘అసురన్ (Asuran), కర్ణన్ (Karnan)’ చిత్రాల తరహాలోని సామాజిక సమస్యను కథాంశంగా రూపొందిస్తున్నట్టు వినికిడి. ‘ఆడుకళాం (Adukalaam), అసురన్’ చిత్రాలతో వరసగా జాతీయ అవార్డులు అందుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల చిత్రంతో మరోసారి నేషనల్ అవార్డు అందుకోవడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ప్రారంభించబోతున్నట్టు టాక్. 

కొంతకాలంగా సరైన హిట్స్ అందులేకపోతున్న ధనుష్.. ప్రస్తుతం ‘ది గ్రేమేన్ (The Greyman)’ హాలీవుడ్ చిత్రంలోనూ, తిరు చిత్రాంబళం (Thiruchitrambalam), ‘నానే వరువేన్ (Nanevaruven)’ తమిళ చిత్రాల్లోనూ నటిస్తుండగా..వాటితో పాటు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సార్’  కూడా తెరకెక్కుతోంది. ఈ నాలుగు చిత్రాలపైనా కోలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. మరి సెన్సిటివ్ అంశాల్ని సెన్సిబుల్‌గా తెరకెక్కించడంలో మాస్టరైన శేఖర్ కమ్ముల .. ధనుష్ కోసం ఎలాంటి కథాంశం రాసుకున్నారు? ఎలాంటి సామాజిక సమస్యను లేవనెత్తబోతున్నారు అనే విషయాలు తెలియాలంటే.. మరికొద్దిరోజులు ఆగాల్సిందే. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.