'ఆదిపురుష్‌' లో హనుమంతుడిగా దేవదత్..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా 'ఆదిపురుష్‌'. ఇందులో హనుమంతుడి పాత్రలో దేవదత్‌ను తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటీ, నటుల విషయంలో చిత్ర బృందం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటోంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఇందులో ఆయన సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరో కృతి సనన్‌ని ఎంపిక చేసుకున్నారు. రావణ్ పాత్రలో సైఫ్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారు. ఇక గత కొన్ని రోజులుగా అందరు ఆతృతగా ఎదురు చూస్తుంది 'హనుమంతుడు'గా ఎవరిని చిత్ర బృందం సెలెక్ట్ చేయనుంది అని. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగేను తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా కరోనా వైరస్ రెండో వేవ్‌తో వాయిదా పడిన చిత్ర షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.