ఆ వీడియోలు తొలగించండి

ABN , First Publish Date - 2021-10-27T08:50:50+05:30 IST

సినీ నటి సమంతకు ఊరట లభించింది. తన పరువుకు భంగం కలిగించారంటూ మూడు యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు....

ఆ వీడియోలు తొలగించండి

సినీ నటి సమంతకు ఊరట లభించింది. తన పరువుకు భంగం కలిగించారంటూ మూడు యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. మంగళవారం సమంత కేసును ఽవిచారించిన ధర్మాసనం తుదితీర్పును వెలువరించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రచారం చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. సమంత కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయరాదంటూ సూచించడంతో పాటు సమంత వ్యక్తిగత వివరాలతో ప్రచారం చేసిన  వీడియో లింక్స్‌ను తొలగించాలని మూడు యూట్యూబ్‌ చానళ్ల నిర్వాహకులను ఆదేశించింది. నటుడు నాగచైతన్యతో విడాకుల విషయంలో తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచారం చేసిన మూడు యూట్యూబ్‌ చానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సినీనటి సమంత గత గురువారం కూకట్‌పల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. 

Updated Date - 2021-10-27T08:50:50+05:30 IST