బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ -దీపిక పదుకోణ్ వెరైటీ స్టెప్పులతో చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వీరు ఇంత ఉల్లాసంగా డాన్స్ చేయడానికి కారణం ఏంటీ అనుకుంటున్నారా..ఉంది. ఈనెల 6వ తేదీన దీపిక భర్త రణ్వీర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా యశ్‌రాజ్ ముఖతే యొక్క వైరల్ మాషప్ 'తువాడా కుట్టా టామీ'కి డ్యాన్స్ చేసింది దీపిక. ఆమెతో పాటు రణ్వీర్ కూడా ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఈ స్టార్ కపుల్ చేసిన డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ 'సర్కస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దీపిక టాలీవుడ్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించబోతోంది.