పెళ్లయ్యాక అమ్మాయిలు మారిపోవాలా?

ABN , First Publish Date - 2022-07-03T17:54:29+05:30 IST

ఇదివరకు సినిమా సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా కథానాయికలు ఏం మాట్లాడాలన్నా ఆలోచించేవారు. ఇప్పుడు అలా కాదు...

పెళ్లయ్యాక అమ్మాయిలు మారిపోవాలా?

ఇదివరకు సినిమా సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా కథానాయికలు ఏం మాట్లాడాలన్నా ఆలోచించేవారు. ఇప్పుడు అలా కాదు... వాళ్ల మనసుల్లో, మాటల్లో ఎలాంటి దాపరికాలూ ఉండడం లేదు. బాలీవుడ్‌ కథానాయికలు ఈ విషయంలో ఇంకాస్త ముందున్నారు. దీపికా పదుకొణె ఇదివరకు ఏ విషయం మీదైనా ఆచితూచి స్పందించేది. ఇప్పుడు అలా కాదు. తన మాటల్లో పరిణితి, ధైర్యం రెండూ కనిపిస్తున్నాయి. మానవ సంబంధాలు, తన బలాలు, బలహీనతలు, పెళ్లైన అమ్మాయిలపై సమాజ దృష్టికోణం... వీటిపై ఆమె ఏమంటోందంటే...


ఓపిక అవసరం

‘‘ఏ రిలేషన్‌లో అయినా నమ్మకం చాలా ముఖ్యం. కమ్యూనికేషన్‌ చాలా అవసరం. ఇవి రెండూ లేకపోతే... ఆ బంధం ముందుకు వెళ్లలేదు. చిన్నప్పుడు నేను చాలా చిన్న చిన్న విషయాలకు అలిగేదాన్ని. ేస్నహితుల్ని కట్‌ చేసుకుంటూ వెళ్లేదాన్ని. అయితే వయసు పెరిగే కొద్దీ బంధాలకు విలువ ఇవ్వడం నేర్చుకొన్నాను. ఒక బంధం కావాలనుకొంటే, కొన్ని విషయాల్లో ఓపిక అవసరం.’’


అవన్నీ కలిపితేనే...

‘‘ఒకరితో పోల్చడం నాకు ఏమాత్రం నచ్చదు. దీపికా ఫలానా కథానాయికలా నటిస్తోందనో, ఆమెలా ఎందుకు కనిపించదనో చెబితే కోపం వస్తుంది. నా ఐడెంటిటీ నాకుంది. కొన్నేళ్లుగా దాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను. నేనేం గొప్పనటిని కాదు. నా పరిమితులు నాకు తెలుసు. నా బలాలు, బలహీనతలు నాకున్నాయి. అవన్నీ కలిపితేనే దీపికా పదుకొణె. కెమెరా ముందున్న నన్ను చూసి జడ్జ్‌ చేయకండి... దాని వెనుక కూడా నాదంటూ ఓ జీవితం ఉంది.’’


జీవితమంటేనే అనుభవాల సారం 

‘‘నేను కలిసిన మనుషులు, చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు, ఎదురైన సంఘటనలు, కన్నీళ్లు, కష్టాలు, విజయాలు, అపజయాలూ... ఇవన్నీ నన్ను తయారు చేశాయి. నాకిప్పుడు 36 ఏళ్లు. ఇప్పటి వరకూ నేర్చుకొన్నది, తెలుసుకొన్నది.. ఇప్పటి నుంచి అప్లయ్‌ చేయడం మొదలెడతాను. 


నో... సినిమా కబుర్లు

‘‘రణవీర్‌ దగ్గర నాకు నచ్చే విషయం ఏమిటంటే... ప్రొఫెషనల్‌ విషయాల్ని నా దగ్గర ప్రస్తావించడు. షూట్‌ అయిపోయాక నేరుగా ఇంటికి వస్తాడు. ఇద్దరి మఽధ్య సినిమా కబుర్లేం ఉండవు. సాధారణ భార్యాభర్తల్లానే ఉండడానికి ఇష్టపడతాం. ఇంట్లో అడుగు పెట్టగానే తను, నేను స్విచ్చాఫ్‌ అయిపోతాం. ఎవరైనా మా మధ్యకు వచ్చి సినిమా విషయాలు బయటకు లాగాలని చూసినా స్పందించం.’’


మాకు లేని ఇబ్బంది వీళ్లకెందుకు?

‘‘పెళ్లయ్యాక అమ్మాయి జీవితం మారిపోవాలి. ఇది వరకటిలా ఉండకూడదు... అంటారు చాలామంది. పెళ్లికి ముందు దీపికానే.. పెళ్లి తరవాత కూడా దీపికనే. అందులో మార్పు ఏముంటుంది? పెళ్లికి ముందు నేను రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటిస్తే తప్పులేనిది.. పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిేస్త తప్పేముంది? ఈమధ్య నేనో సినిమా చేశాను. అందులో సన్నివేశానుసారం కథానాయకుడ్ని ముద్దు పెట్టుకోవాలి. అది చూసి మేల్‌ ఈగో హర్టయిపోయింది. సినిమా గురించి రణ్‌వీర్‌కు నాకూ బాగా తెలుసు. మా ప్రొఫెషనల్‌ ేస్పస్‌ మాకుంది. మాకు లేని ఇబ్బంది వీళ్లకెందుకో అర్థం కాదు.’’


కొత్తబాట తప్పదు

‘‘అమ్మాయిలకు నేనిచ్చే సలహా ఒకటే.. ఏమైనా చేయాలనుకుంటే చేేసయండి. వాళ్లేమనుకుంటారు, వీళ్లేం అనుకుంటారు? అని అస్సలు ఆలోచించకండి. మన జీవితాలపై మరొకరి ఆధిప్యతం ఏమిటి? ‘నువ్వు అమ్మాయివి కాబట్టి.. ఇలానే ఉండు..’ అని ఎవరైనా చెబితే అస్సలు వినొద్దు. అలాగని మితిమీరిన స్వేచ్ఛ మంచిది కాదు. మీ జీవితం ఇంకొకరికి పాఠం కావాలి గానీ గుణపాఠం కారాదు. మీ అడుగుజాడల్లో మరొకరు నడవాలంటే కొత్త బాటని ఎంచుకోవాల్సిందే.’’ 

Updated Date - 2022-07-03T17:54:29+05:30 IST