Deepika padukone: ఏమీ చేయలేక.. చనిపోదాం అనుకున్నా

ABN , First Publish Date - 2021-09-13T20:20:53+05:30 IST

దీపికా పదుకోన్‌ బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ కథానాయిక. ఇదంతా ఇప్పుడు! గతంలో ఆమె కూడా ఎన్నో స్ట్రగుల్స్‌ ఎదుర్కొన్నారు. కొన్ని కారణాలతో 2014లో డిఫ్రెషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని దీపికా ఎన్నోసార్లు తెలిపారు. తాజాగా ఆమె బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొన్నారు.

Deepika padukone: ఏమీ చేయలేక.. చనిపోదాం అనుకున్నా

దీపికా పదుకోన్‌ బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ కథానాయిక. ఇదంతా ఇప్పుడు! గతంలో ఆమె కూడా ఎన్నో స్ట్రగుల్స్‌ ఎదుర్కొన్నారు. కొన్ని కారణాలతో 2014లో డిఫ్రెషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని దీపికా ఎన్నోసార్లు తెలిపారు. తాజాగా ఆమె  బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేయగా దాని గురించి ఆమె మరోసారి చెప్పుకొచ్చారు.


‘2014లో కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దానివల్ల కొన్నాళ్లు డిప్రెషన్‌కు గురయ్యాను. నిద్ర లేవగానే ఏదోలా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని ఉండేది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. ఏమీ చేయలేని ఈ జీవితం ఎందుకు అనుకొని చనిపోదామనుకున్నా. నా  మెంటల్‌ కండీషన్‌ గమనించిన అమ్మ వెంటనే సైకియార్టిస్ట్‌ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. చికిత్స మొదలుపెట్టిన కొన్నాళ్లకు నేను మామూలు మనిషిని అయ్యా’’ అని దీపికా కన్నీటి పర్యాంతమయ్యారు. అప్పట్లో ఆమె అనుభవించిన బాధ మరొకరు అనుభవించకూడదని ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ ఫౌండేషన్‌ స్థ్థాపించారు దీపిక. ఈ పౌండేషన్‌ ద్వారా చాలా మంది డిఫ్రెషన్‌ నుంచి బయటపడుతున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే దీపికా ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రంలో నటించిందని, షూటింగ్‌ సమయంలో ఒక్కరోజు కూడా బాధపడుతున్నట్లు కనిపించలేదని ఆ చిత్ర దర్శకురాలు ఫరాఖాన్‌ చెప్పారు. అయితే ఇలాంటి విషయాలు అంత తొందరగా ఎవరూ బయటపెట్టరని, తను అనుభవించిన మనోవేదనను ధైర్యంగా చెప్పుకొచ్చిన దీపికా పడుకోన్‌ను అమితాబ్‌ ప్రశంసించారు. అలాంటి రోజులు మళ్లీ మళ్లీ రాకూడదని ఆయన ఆకాంక్షించారు. 




Updated Date - 2021-09-13T20:20:53+05:30 IST