దీపిక కొత్త చిత్రం

ABN , First Publish Date - 2021-09-01T06:53:49+05:30 IST

బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకోన్‌ లీడ్‌రోల్‌లో ఓ అంతర్జాతీయ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ ఎస్‌టీఎక్స్‌ ఫిల్మ్స్‌, దీపిక సొంత బేనర్‌ కా ప్రొడక్షన్స్‌...

దీపిక కొత్త చిత్రం

బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకోన్‌ లీడ్‌రోల్‌లో ఓ అంతర్జాతీయ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ ఎస్‌టీఎక్స్‌ ఫిల్మ్స్‌, దీపిక సొంత బేనర్‌ కా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్‌టీఎక్స్‌ ఫిల్మ్స్‌ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని, రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు తెలిపారు. భిన్న సంస్కృతుల నేపథ్యంలో సినిమా సాగుతుంది.


Updated Date - 2021-09-01T06:53:49+05:30 IST