పఠాన్‌ సెట్‌లో దీపిక

షారూఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘పఠాన్‌’ సెట్‌లోకి కథానాయిక దీపికా పడుకోన్‌ అడుగుపెట్టారు. ఇంకో 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌ షూటింగ్‌లో దీపికా పాల్గోనున్నారు. షారూఖ్‌ ఖాన్‌ గూఢచారి పాత్రలో కనిపిస్తున్నారు.  దీపిక ఇప్పటిదాకా చేయని సరికొత్త పాత్రలో ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కొన్ని రోజులుగా షారూఖ్‌ఖాన్‌, జాన్‌ అబ్రహంపై కీలక సన్నివేశాలు చిత్రీక రిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్‌ సరసన ‘83’, షకూన్‌ బాత్రా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘సర్కస్‌’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.