దిమ్‌ సారె...

ABN , First Publish Date - 2021-07-11T07:01:01+05:30 IST

సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆకాశవాణి’. ఇందులో ‘దిమ్‌ సారె...’ పాటను విడుదల చేశారు....

దిమ్‌ సారె...

సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆకాశవాణి’. ఇందులో ‘దిమ్‌ సారె...’ పాటను విడుదల చేశారు. ఓ గూడెంలోని ప్రజలందరూ బాధలో ఉండగా... అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా జాతర జరపుకోవాలనే సందర్భంగా వచ్చిన ఈ పాటను అనంత్‌ శ్రీరామ్‌ రాశారు. కాలభైరవ స్వరకల్పనలో అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘‘రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్‌ గంగరాజు సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. ఇప్పటికే విడుదల చేసిన ‘మన కోన...’ పాటకు మంచి స్పందన లభించింది. ‘దిమ్‌ సారె...’ సైతం అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కళ: మోహన్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సురేశ్‌ రగుతు.


Updated Date - 2021-07-11T07:01:01+05:30 IST