ఆమని ఉంటే పక్కన...
ABN , First Publish Date - 2021-07-17T04:13:32+05:30 IST
మేఘా ఆకాశ్, ఆదిత్ ఆరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. చిత్రంలో ‘ఆమని పక్కన ఉంటే...’ పాటను శుక్రవారం పూజా హెగ్డే విడుదల చేశారు....

మేఘా ఆకాశ్, ఆదిత్ ఆరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. చిత్రంలో ‘ఆమని పక్కన ఉంటే...’ పాటను శుక్రవారం పూజా హెగ్డే విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హరి గౌర స్వరకల్పనలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. ‘‘అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రమిది. ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అర్జున్ దాస్యన్ తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్ పూడి, కెమెరా: ఐ ఆండ్రూ.