'డియర్ మేఘ' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

ABN , First Publish Date - 2021-07-16T18:01:34+05:30 IST

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి 'డియర్ మేఘ'. తాజాగా ఈ మూవీ నుంచి 'ఆమని ఉంటే' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించగా, గౌర హరి సంగీతం అందించారు.

'డియర్ మేఘ' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి 'డియర్ మేఘ'. తాజాగా ఈ మూవీ నుంచి 'ఆమని ఉంటే' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించగా, గౌర హరి సంగీతం అందించారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఇందులో అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉన్న 'డియర్ మేఘ'ని త్వరలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ వెల్లడించారు.   




Updated Date - 2021-07-16T18:01:34+05:30 IST