ఏసేశాడు.. వార్నర్ ఆ స్టెప్ కూడా ఏసేశాడు

ABN , First Publish Date - 2022-01-22T02:47:49+05:30 IST

ఏసేశాడు.. వార్నర్ ఆ స్టెప్ కూడా ఏసేశాడు. ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పటి నుండి వార్నర్ ఆ ట్రాన్స్‌లో నుండి రాలేకపోతున్నట్లున్నాడు. ఆ సినిమాలోని డైలాగ్స్, డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న వార్నర్..

ఏసేశాడు.. వార్నర్ ఆ స్టెప్ కూడా ఏసేశాడు

ఏసేశాడు.. వార్నర్ ఆ స్టెప్ కూడా ఏసేశాడు. ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పటి నుండి వార్నర్ ఆ ట్రాన్స్‌లో నుండి రాలేకపోతున్నట్లున్నాడు. ఆ సినిమాలోని డైలాగ్స్, డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న వార్నర్.. తాజాగా ‘శ్రీవల్లి’ పాటలోని చెప్పు ఊడిపోయే స్టెప్ కూడా ఏసేశాడు. అంతకుముందు ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలకు కూడా వార్నర్ నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ‘పుష్ప’ పాటలపై దృష్టి పెట్టారు. ఆయన ఈ స్టెప్ వేసిన విధానం నిజంగా చూడముచ్చటగా ఉంది. ఆయన వేసిన ఈ స్టెప్‌పై నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు. దీని కోసం ఆయన ఎంత కష్టపడి ఉంటారో.., సూపర్బ్, గ్రేట్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


సౌత్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపునివ్వడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వార్నర్‌.. ఈ వీడియోతో పాటు ‘పుష్ప’ స్టెప్ వేసేశా.. తర్వాత ఏంటి? అంటూ కామెంట్ చేశారు. కొందరు నెటిజన్లు ‘నాటు నాటు’ పాటని సూచించగా.. ‘అది చాలా కష్టంగా ఉంది’ అని బదులిచ్చారు. కాగా, వార్నర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకి అల్లు అర్జున్ కూడా ఫిదా అవుతున్నట్లుగా రిప్లయ్ ఇచ్చారు. 



Updated Date - 2022-01-22T02:47:49+05:30 IST