నిర్మాతగా కోడి రామకృష్ణ కుమార్తె
ABN , First Publish Date - 2021-07-16T09:00:26+05:30 IST
దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ్జకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి దివ్యదీప్తి, చిన్న కుమార్తె ప్రవల్లిక. పెద్ద కుమార్తెకు మొదటినుంచీ సినిమాలంటే ఆసక్తి....

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ్జకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి దివ్యదీప్తి, చిన్న కుమార్తె ప్రవల్లిక. పెద్ద కుమార్తెకు మొదటినుంచీ సినిమాలంటే ఆసక్తి. దాదాపు ఐదేళ్ల పాటు తండ్రి దర్శకత్వం వహించే సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో బిజీ అవడంతో సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనే అభిప్రాయంతో తిరిగి ఆమె పరిశ్రమలోకి ప్రవేశించారు. అయితే దర్శకురాలిగా కాకుండా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమాలు తీయాలని నిర్ణయించుకొన్నారు. గురువారం తన తొలి సినిమా వివరాలను ఆమె ప్రకటించారు. కిరణ్ అబ్బవరం హీరోగా కోడి దివ్యదీప్తి నిర్మించే తొలి చిత్రంతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కోడి దివ్యదీప్తి చెప్పారు.