శరవేగంగా దర్శకరత్న దాసరి బయోపిక్ కు సన్నాహాలు

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు బయోపిక్ కు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గతంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శ్రీశైలం వంటి భారీ బడ్జెట్ హిట్ సినిమాను ఇదే నిర్మాత నిర్మించిన సంగతి గుర్తుండే ఉంటుంది.  కాగా ఈ చిత్రం గురించిన విషయాలను తెలియజేసేందుకు  గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో  చిత్ర యూనిట్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 


దర్శకుడు ధవళసత్యం మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి,  రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది. దాంతో నాకు తెలిసిన,, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం ఉన్న అనేకమందిని సంప్రదించి, ఈ  చిత్రం స్క్రిప్ట్ ను అద్భుతంగా రూపకల్పన చేయడం జరుగుతోంది. తప్పకుండా దీనిని ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించేందుకు, దాసరి గారి పట్ల ఎనలేని అభిమానంతో పాటు మంచి అభిరుచి కలిగిన తాడివాక రమేష్ నాయుడు ముందుకు రావడం అభినందనీయం'  అని అన్నారు. ఆ తర్వాత చిత్ర నిర్మాత తాడివాక రమేష్ నాయుడు, ఇదే ప్రెస్ మీట్లో పాల్గొన్న రేలంగి నరసింహారావు, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, ఛాంబర్ కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నటుడు కాశీ విశ్వనాధ్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తదితరులు దాసరి వ్యక్తిత్వాన్ని, సేవాగుణాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.