డబుల్‌ యాక్షన్‌

ABN , First Publish Date - 2022-11-19T05:30:00+05:30 IST

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డబుల్‌ యాక్షన్‌

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరాటే రాజు నిర్మాత. శుక్రవారం ఈచిత్రం ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ట్రైలర్‌ ఆద్యంతం విష్వక్‌ ఒన్‌మాన్‌షో కనిపించింది. వెయిటర్‌గా, ప్రేమికుడిగా, ఫైటర్‌గా విష్వక్‌ తనలోని ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్‌ కథానాయిక. రావు రమేష్‌ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం లియోన్‌ జేమ్స్‌. సినిమాటోగ్రఫీ: దినేష్‌ కె. బాబు. 

Updated Date - 2022-11-19T05:30:00+05:30 IST