డార్లింగ్స్‌ పూర్తయింది

ABN , First Publish Date - 2021-09-08T05:57:03+05:30 IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ నటిస్తూ, నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న చిత్రం ‘డార్లింగ్‌్స’. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా...

డార్లింగ్స్‌ పూర్తయింది

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ నటిస్తూ, నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న చిత్రం ‘డార్లింగ్స్‌’.  చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంది. ఆ వీడియోలను, ఫొటోలను అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. జస్మీత్‌ కె. రీన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షెఫాలీ షా, రోషన్‌ మాథ్యూ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. షారూఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌తో కలసి అలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Updated Date - 2021-09-08T05:57:03+05:30 IST