‘ఊ’ అంటోన్న ‘దంగల్’ హీరోయిన్.. రిప్లై ఇచ్చిన హన్సిక, మృణాల్ ఠాకూర్..
ABN , First Publish Date - 2022-01-30T02:46:06+05:30 IST
‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే

‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’ పాట ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ గ్లోబల్ లిస్ట్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచి మొదటి స్థానం పొందింది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ పాటకు చిందులేశారు. తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు.
‘దంగల్’ హీరోయిన్ సాన్యా మల్హోత్రా ‘ఊ అంటావా.. ’ పాటకు స్టెప్పులేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హిట్ పాటకు తనదైన స్టైల్‌లో మరొకరితో కలిసి డ్యాన్స్ చేసి నెటిజన్లను ఊర్రూతలూగించింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లలందరూ ఫిదా అయ్యారు. అభిమానులతోపాటు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రియమణి, మృణాల్ ఠాకూర్ ‘ఫైర్’ సింబల్‌తో కామెంట్ చేశారు. లవ్ ఎమోజీతో హన్సిక రిప్లై ఇచ్చింది. ‘పుష్ప’ సినిమాకు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.