తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన 'హిట్' మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా హీరోయిన్గా ఎంపికైంది. కాప్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఇందులో బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. తెలుగు ఒరిజినల్ వర్షన్‌కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌ను తెరకెక్కించనున్నాడు. టి-సిరీస్ భూషణ్ కుమార్, దిల్ రాజు, క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రాను ఫైనల్ చేశారు. రీసెంట్గా 'హిట్' సినిమా చూశానని, దీని హిందీ రీమేక్‌లో నటించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. కాగా త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకి రాబోతోంది.