'ద‌మ్మున్నోడు' చిత్రం షూటింగ్

బి.కె.ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై శివ‌ జొన్న‌ల‌గ‌డ్డ  హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం `ద‌మ్మున్నోడు`. దుమ్ముదులుపుతాడు ట్యాగ్ లైన్‌.  బాలాజీ కొండేక‌ర్ , రేణుక కొండేక‌ర్ నిర్మాత‌లు.  ప్రియాంశ్‌, గీతాంజ‌లి, స్వ‌ప్ప హీరోయిన్స్. ఈ చిత్రం మంగళవారం హైద‌రాబాద్‌లోని రాక్ క్యాసిల్ హోటల్‌లో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియ‌ర్  ప్రొడ్యూస‌ర్  ప్ర‌స‌న్న కుమార్ తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా మ‌రో ప్ర‌ముఖ‌ నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా..

 హీరో, డైరెక్ట‌ర్ శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ ``నా మొద‌టి సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రోత్స‌హిస్తూ వ‌స్తోన్న ప్ర‌స‌న్న కుమార్ గారికీ, రామ‌స‌త్య‌నారాయ‌ణ గారికీ, ఫిలించాంబ‌ర్ వారికీ నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. నా క‌థ‌, టైటిల్ న‌చ్చి మా నిర్మాత బాలాజీ గారు ఈ సినిమాను నిర్మించ‌డానికి ముందుకొచ్చారు.  ప‌వ‌ర్ ఫుల్ స్టోరి, మాస్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, సాంగ్స్‌తో రూపొందుతోన్న సినిమా ఇది.  ఈ రోజు ఫైట్‌తో షూటింగ్ ప్రారంభించాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాకు ఫైట్స్ ప‌రంగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో డాన్స్ ప‌రంగా కూడా పేరొస్తుందన్న న‌మ్మ‌కం ఉంది. ఇందులో నాలుగు పాట‌లు అద్భుతంగా కుదిరాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తాం`` అన్నారు. నిర్మాత బాలాజీ కొండేక‌ర్  మాట్లాడుతూ ``సొలో ప్రొడ్యూస‌ర్‌గా నాకిది తొలి సినిమా. గ‌తంలో `సూప‌ర్ ప‌వ‌ర్‌` చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించా.  ద‌మ్మున్నోడు క‌థ‌, టైటిల్ న‌చ్చి  నిర్మిస్తున్నా. ఇందులో ఏడు భారీ ఫైట్స్, నాలుగు అద్భుత‌మైన పాట‌లు ఉంటాయి. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేశాం`` అన్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.