చైతూ సినిమాలో ‘జాంబిరెడ్డి’ బ్యూటీ

ABN , First Publish Date - 2022-01-10T13:45:36+05:30 IST

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రాన్ని జనవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా వేదిక, పరియా, సిమ్రత్ కౌర్ లాంటి బ్యూటీస్ కూడా ఉన్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సరిగ్గా ఐదేళ్ళక్రితం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

చైతూ సినిమాలో ‘జాంబిరెడ్డి’ బ్యూటీ

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రాన్ని జనవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా వేదిక, పరియా, సిమ్రత్ కౌర్ లాంటి బ్యూటీస్ కూడా ఉన్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సరిగ్గా ఐదేళ్ళక్రితం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాను సంక్రాంతి రేస్ లోకి దింపుతున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా నర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సుందరిని కూడా మరో ప్రత్యేక గీతానికి ఎంపిక చేశారు.


తేజా సజ్జా హీరోగా నటించిన తొలి చిత్రం ‘జాంబిరెడ్డి’ లో కథానాయికగా నటించిన దక్షా నగార్కర్‌ను చైతూతో ఓ సెలబ్రేషన్ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, మైసూర్ లోనూ ఆ పాటను షూట్ చేశారు. రీసెంట్ గా ‘బంగార్రాజు’ చిత్రంలోని తన ప్రత్యేక గీతం గురించి దక్షా పలు విశేషాలు చెప్పింది. ఈ పాట కోసం తను చాలా రిహార్సల్స్ చేసినట్టు చెప్పింది. ఈ విషయంలో నాగచైతన్యకి చాలా ఓపికని,  ఆయన రిహార్సల్స్ కు తనతో బాగా సహకరించారని చెప్పింది. మరి దక్షా స్పెషల్ సాంగ్ ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-01-10T13:45:36+05:30 IST