‘ఏజెంట్’ అఖిల్‌కు వైజాగ్‌లో భారీ స్వాగతం
ABN , First Publish Date - 2022-04-12T02:34:40+05:30 IST
యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన కొత్త షెడ్యూల్ తాజాగా వైజాగ్ పోర్ట్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించనున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.
అయితే షూటింగ్‌లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్‌కు ఎయిర్ పోర్ట్‌లో అక్కినేని అభిమానులు భారీ స్వాగతం పలికారు. అఖిల్‌ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్.. బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. తనపై అభిమానులు చాటిన అభిమానానికి అఖిల్ కూడా మురిసిపోయారు. హై వోల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఏజెంట్‌గా అఖిల్ లుక్ ఇప్పటికే ఆకర్షిస్తోంది. కాగా, హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ కథని సమకూర్చారు.