సుమంత్‌కి క్రేజీ ఆఫర్..?

ABN , First Publish Date - 2021-07-14T21:45:22+05:30 IST

టాలీవుడ్ హీరో సుమంత్‌కి తాజాగా ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తెరకెక్కించి తెలుగులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి తమిళ, తెలుగు భాషలలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కోలీవుడ్ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నాడు.

సుమంత్‌కి క్రేజీ ఆఫర్..?

టాలీవుడ్ హీరో సుమంత్‌కి తాజాగా ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తెరకెక్కించి తెలుగులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి తమిళ, తెలుగు భాషలలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కోలీవుడ్ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నాడు. 1964 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఆర్మీ లవ్ స్టోరీగా దీనిని రూపొందిస్తుండగా, సుమంత్‌ని విల పాత్రకి ఎంచుకున్నారట. ఈ సినిమాను ప్రియాంకా దత్, స్వప్నా దత్‌ నిర్మిస్తున్నారు. త్వరలో దీనికి సంబంధిచిన అఫీసియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం. కాగా ప్రస్తుతం సుమంత్‌ హీరోగా నటించిన 'అనగనగా ఒక రౌడీ' విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమా మీద బాగానే అంచనాలను పెంచాయి. చూడాలి మరి ఆయనకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.  

Updated Date - 2021-07-14T21:45:22+05:30 IST