దర్శకుడు సెల్వరాఘవన్‌కు పాజిటివ్‌..!

ABN , First Publish Date - 2022-01-24T19:21:21+05:30 IST

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ‘నేను కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నాను.

దర్శకుడు సెల్వరాఘవన్‌కు పాజిటివ్‌..!

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ‘నేను కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో నాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ మద్య నన్ను కలిసిన వాళ్ళందరూ కరోనా పరీక్షలు చేయించుకుని, ఐసోలేషన్‌లో ఉండాల ని కోరుతున్నా’ అని సెల్వరాఘవన్‌ సోషల్‌ మీడియా ద్వారా కోరారు. ప్రస్తుతం ఈయన దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా రాణిస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు మరో నటుడు జయరాం కూడా కరోనా బారినపడ్డారు. ఈయన కూడా ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. 

Updated Date - 2022-01-24T19:21:21+05:30 IST