టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కు కొవిడ్ పాజిటివ్..!

ABN , First Publish Date - 2022-01-21T17:52:03+05:30 IST

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ఆయనే తన ఇన్స్తాగ్రాం ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ ఒమైక్రాన్ వైరస్ మొదలైనప్పటి నుంచి సినీ తారలు చాలామందికి పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కు కొవిడ్ పాజిటివ్..!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ఆయనే తన ఇన్స్తాగ్రాం ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ ఒమైక్రాన్ వైరస్ మొదలైనప్పటి నుంచి సినీ తారలు చాలామందికి పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వారిలో తిరిగి కొంతమంది కోలుకున్నారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు కొవిడ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో విషయాన్ని కాస్త కామెడిగానే చెప్తూ కొవిడ్‌ను సీరియస్‌గా తీసుకోమని సూచించారు. కాగా, 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. 



Updated Date - 2022-01-21T17:52:03+05:30 IST