దీనికి అలవాటు పడవచ్చు: సమంత

ABN , First Publish Date - 2022-01-25T23:15:17+05:30 IST

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత జీవితాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తోంది. తనకు ఖాళీ సమయం దొరికితే చాలు విదేశాల్లో విహరిస్తోంది. తాజాగా ఆమె స్విట్జర్లాండ్‌ విహారయాత్రలో నిమగ్నమై ఉంది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలను

దీనికి అలవాటు పడవచ్చు: సమంత

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత జీవితాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తోంది. తనకు ఖాళీ సమయం దొరికితే చాలు విదేశాల్లో విహరిస్తోంది. తాజాగా ఆమె స్విట్జర్లాండ్‌ విహారయాత్రలో నిమగ్నమై ఉంది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా, అవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ బ్యూటీ షేర్‌ చేసిన ఫొటోల్లో జీన్స్‌తో పాటు నలుపు రంగు టాప్‌ ధరించి ఫొటోలకు ఫోజిచ్చింది. 


ఈ పిక్‌లో తన హాలిడే డెస్టినేషన్‌లోని సుందరమైన ప్రదేశాన్ని చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ పిక్‌కు సమంత తెలుపు రంగు హార్ట్‌ ఎమోజీతో ‘దీనికి అలవాటు పడొచ్చు’ అంటూ కామెంట్‌ చేసింది. అంతకుముందు ఆమె స్నో స్పోర్ట్స్‌లో ఆడుతున్న ఫొటోలు, వీడియోలను కూడా ఇన్‌స్టాఖాతాలో షేర్‌ చేసింది. స్విస్‌లో మంచు పర్వతాల్లో ఉన్న ఫొటోలను ఆమె షేర్‌ చేసి, పూర్తి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నట్టు సంకేతాలు పంపింది.



Updated Date - 2022-01-25T23:15:17+05:30 IST