45 సెకన్లలో విశ్వరూపం
ABN , First Publish Date - 2021-11-02T08:44:14+05:30 IST
‘బాహుబలి’తో దేశమంతా టాలీవుడ్ వైపు చూసింది. మేకింగ్ పరంగా ‘బాహుబలి’ కొత్త పాఠాలు నేర్పింది. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ వంతు వచ్చింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కలయికలో రూపుదిద్దుకున్న చిత్రమిది....

‘బాహుబలి’తో దేశమంతా టాలీవుడ్ వైపు చూసింది. మేకింగ్ పరంగా ‘బాహుబలి’ కొత్త పాఠాలు నేర్పింది. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ వంతు వచ్చింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కలయికలో రూపుదిద్దుకున్న చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. సోమవారం ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్స్‌ని విడుదల చేశారు. కేవలం 45 సెకన్ల పాటు సాగిన చిన్న టీజర్ ఇది. ఆ 45 సెకన్లలోనే విశ్వరూపం చూపించేశారు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్‌ల పోరాటాలు, ఫిరంగి మోతలు. బుల్లెట్ల వాన, పులి వేట... ఇలా తక్కువ నిడివిలోనే థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ చూపించేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.450 కోట్లు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. అజయ్ దేవగణ్, అలియాభట్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.