కమల్‌కి కరోనా పాజిటీవ్‌

ABN , First Publish Date - 2021-11-23T05:37:19+05:30 IST

ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ కరోనా బారీన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు...

కమల్‌కి కరోనా పాజిటీవ్‌

ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ కరోనా బారీన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చాక అస్వస్థతకు గురయ్యా. పరీక్షలు చేయించుకుంటే కొవిడ్‌ పాజిటీవ్‌ అని తేలింది. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నా. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు కమల్‌. ప్రస్తుతం ‘విక్రమ్‌’లో నటిస్తున్న కమల్‌.. ‘బిగ్‌ బాస్‌’ తమిళ వెర్షన్‌కి హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు.


Updated Date - 2021-11-23T05:37:19+05:30 IST