వివాదంలో చిక్కుకున్న మణిరత్నం నవరస..!

ABN , First Publish Date - 2021-08-08T18:51:24+05:30 IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన "నవరస" వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆయన తెరకెక్కించిన 'నవరస' సినిమాపై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంథాలజీ వెబ్ సిరీస్‌గా మణిరత్నం నిర్మించిన తొమ్మిది చిత్రాల సంకలనం 'నవరస'.

వివాదంలో చిక్కుకున్న మణిరత్నం నవరస..!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన "నవరస" వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆయన తెరకెక్కించిన 'నవరస' సినిమాపై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంథాలజీ వెబ్ సిరీస్‌గా మణిరత్నం నిర్మించిన తొమ్మిది చిత్రాల సంకలనం 'నవరస'. దీనిని ఇటీవల నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఇది తొమ్మిది లఘు చిత్రాలుగా వచ్చింది. తొమ్మిది మంది దర్శలు తెరకెక్కించగా ప్రముఖ నటీనటులతో రూపొందిన ఈ యాంథాలజీకి ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ 9 కథలలో 5 కథలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అరవింద్ స్వామి, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించారు. 


అయితే, కొంతమంది ముస్లింలు పవిత్ర ఖురాన్‌లోని పద్యాలను సినిమా ప్రచారం కోసం ఉపయోగించడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని వివాదం రాజుకుంది. అంతేకాదు, ఒకకథలో ఖురాన్ పద్యాల గురించి ప్రస్తావనలు ఉండడం కూడా ఈ వివాదానికి మరో కారణం అయింది. దాంతో రజా అకాడమీ అనే ముస్లిం సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'నవరస' యాడ్‌కు సంబంధించి ఓ వార్తాపత్రికలో ఖురాన్ పద్యం ప్రచురించింది. ఇది ఖురాన్‌ను అవమానించడం అని వారు ఆరోపిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాగా ఈ వివాదంపై మణిరత్నం గానీ ఈ భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు గానీ ఇంకా స్పందించలేదు. 

Updated Date - 2021-08-08T18:51:24+05:30 IST