Thank God: అజయ్ దేవగణ్ సినిమాకు వ్యతిరేకంగా కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-23T22:55:14+05:30 IST

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించిన సినిమా ‘థాంక్ గాడ్’ (Thank God). సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కీలక పాత్రలు పోషించారు. ‘థాంక్ గాడ్’ ట్రైలర్

Thank God: అజయ్ దేవగణ్ సినిమాకు వ్యతిరేకంగా కేసు నమోదు

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించిన సినిమా ‘థాంక్ గాడ్’ (Thank God). సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ  ట్రైలర్ విడులయినప్పటి నుంచి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది. ఓ వర్గం వారి మనోభావాలను కించపరిచేలా ఈ ట్రైలర్ ఉందని కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 


అజయ్ దేవగణ్ ‘థాంక్ గాడ్’ లో చిత్ర గుప్తుడిగా నటించాడు. దీంతో కొంత మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. క్షత్రియ సమాజ్‌కు చెందిన సభ్యులు అసంతృప్తికి లోనయ్యారు. ఫలితంగా అజయ్ దేవగణ్, టీ సిరిస్ తదితరులకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రకాంత్ సక్సేనా అనే సీనియర్ సభ్యుడు క్షత్రియ సమాజ్‌ తరఫున నిహాల్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు. ‘థాంక్ గాడ్’ బృందంపై చర్యలు తీసుకోవాలని సమాజ్ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు కూడా మెమొరాండం అందించారు. చిత్ర గుప్తుడిని అపహాస్యం చేసేలా చిత్ర ట్రైలర్ ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఆ సన్నివేశాలు ఉన్నాయన్నారు. అభ్యంతకరకరమైన సీన్స్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంపై కువైట్ ప్రభుత్వం నిషేధం విధించింది. చిత్రంలోని ఓ సీన్‌పై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యతరం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాన్ని తీసేయాలని కోరింది. ఆ సీన్‌ను తీసివేస్తేనే సినిమా విడుదలకు అనుమతిస్తామని చెప్పింది.  ‘థాంక్ గాడ్’ ఫాంటసీ కామెడీ‌గా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. 


ఇక అజయ్ దేవగణ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడి చేతిలో వరుస ప్రాజెక్టులున్నాయి. ‘బోలా’, ‘దృశ్యం-2’, ‘సర్కస్’ సినిమాలున్నాయి. కోలీవుడ్ హిట్ మూవీ ‘ఖైదీ’ కి రీమేక్‌గా ‘బోలా’ తెరకెక్కుతుంది. ‘సర్కస్’ కు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్డే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్‌మస్ కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. 




Updated Date - 2022-09-23T22:55:14+05:30 IST