త్వరలో ‘నీ జతగా’

ABN , First Publish Date - 2021-09-23T06:37:30+05:30 IST

భరత్‌ బండారు, జ్ఞానేశ్వరి కండ్రేగుల, నయని పవని, ప్రణవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీ జతగా’. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామ్‌ .బి తెలిపారు...

త్వరలో ‘నీ జతగా’

భరత్‌ బండారు, జ్ఞానేశ్వరి కండ్రేగుల, నయని పవని, ప్రణవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీ జతగా’. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామ్‌ .బి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది. అనంత శ్రీరామ్‌గారు రాసిన పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. త్వరలో ట్రైలర్‌, ఈ నెలలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ‘‘ప్రకృతిని వర్ణిస్తూ... ట్రెక్కింగ్‌ నేపథ్యంలో ప్రయాణం, జీవితం ఒకే చోట మొదలయ్యే సందర్భంలో మంచి పాట రాశా’’ అని అనంత శ్రీరామ్‌ చెప్పారు. భమిడిపాటి వీర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పవన్‌ సంగీత దర్శకుడు.


Updated Date - 2021-09-23T06:37:30+05:30 IST