Pakka Commercial : హిలేరియస్ ఇంటర్వెల్ బ్యాంగ్ ?

Twitter IconWatsapp IconFacebook Icon
Pakka Commercial : హిలేరియస్ ఇంటర్వెల్ బ్యాంగ్ ?

టాలీవుడ్ లో కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో మారుతి (Maruthi) స్టైలే వేరు. ఎంతటి పెద్ద హీరోతో, ఎలాంటి సినిమా తీసినా.. తన మార్క్ వినోదానికి ఎలాంటి లోటు రానీకుండా జాగ్రత్తపడతాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) చిత్రాన్ని పక్కా కమర్షియల్ హిట్ చేయడానికి వినూత్నరీతిలో ప్రచార కార్యక్రమాల్ని చేపట్టారు. జూలై 1న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలవుతోంది. మ్యాచో హీరో గోపీచంద్‌(Gopi Chand)తో మారుతి తొలిసారిగా తెరకెక్కించిన నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ లాంటి యాక్షన్ హీరో మారుతి తరహా కామెడీ పండించనుండడం ఈ సినిమా ప్రత్యేకత. ఇదివరకు విడుదలైన ఈ సినిమా సింగిల్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ పంచులతో ట్రైలర్ నిండిపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ హిలేరియస్‌గా వర్కవుట్ అయినట్టు సమాచారం. 

సాధారణంగా ఓ అదిరిపోయే యాక్షన్ సీన్‌తో గోపీచంద్ లాంటి హీరోలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వడం ఆనవాయితీ. అయితే దాన్ని రవర్స్ చేసేసి పూర్తిగా కామెడీ చేసేశాడట మారుతి. అసలు ఈ సినిమా ఇంటర్వెల్ లో ఫక్తు కమర్షియల్ చిత్రాల ఇంటర్వెల్ బ్యాంగ్స్‌పై సెటైర్ పడబోతోందట. చాలా సినిమాల్లో ‘హీరో విలన్ తో నీ అంతు సెకండాఫ్ లో చూస్తా’ అంటూ వార్నింగివ్వడం కనిపిస్తుంది. ఈ సినిమాలో అలాంటి డైలాగ్స్ వాడుతునే వాటిపై సెటైర్ వేశారని సమాచారం అందుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ చాలా హిలేరియస్ గా వచ్చిందట. 

అలాగే.. ఇందులో టీవీ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న రాశీఖన్నా(Rashi Khanna)కూడా మంచి కామెడీని పండించిందట. ఈ పాత్రతో టీవీ సీరియల్స్,అందులోని పాత్రలపై కూడా సెటైర్ పడిందట. మొత్తానికి ‘పక్కా కమర్షియల్’ చిత్రం పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాని నిలబెట్టేది కామెడీనే  అని చిత్ర బృందం గట్టిగా నమ్ముతోంది. ‘ప్రతిరోజూ పండగే’ (Prathiroju Pandage) సినిమా తర్వాత మళ్ళీ ఆరేంజ్ లో మళ్ళీ ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో నవ్వులు పూస్తాయని చెబుతున్నారు. మరి ఈ సినిమా గోపీచంద్‌కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.