‘క‌ల‌ర్‌ ఫొటో’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2020-10-24T04:47:45+05:30 IST

కోవిడ్ స‌మ‌యాల్లో ఓటీటీ మాధ్య‌మాలు సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు చేర‌వేయడంలో కీల‌క‌భూమిక‌ను పోషించాయి. ఆ కోవ‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ‘క‌ల‌ర్‌ఫొటో’. ఈ చిత్రంతో

‘క‌ల‌ర్‌ ఫొటో’ మూవీ రివ్యూ

చిత్రం: క‌ల‌ర్‌ఫొటో

స‌మ‌ర్ప‌ణ‌: శ్ర‌వ‌ణ్ కొండ‌

విడుద‌ల‌: ఆహా

బ్యాన‌ర్‌: అమృత ప్రొడ‌క్ష‌న్‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

న‌టీన‌టులు: సుహాస్‌, చాందిని చౌద‌రి, సునీల్‌, వైవా హ‌ర్ష, ఆద‌ర్శ్  త‌దిత‌రులు

సంగీతం: కాల భైర‌వ‌

క‌థ‌: సాయి రాజేశ్‌

ఆర్ట్‌: క్రాంతి ప్రియం

ఎడిటింగ్‌: కోదాటి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి

నిర్మాత‌: ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని, సాయిరాజేశ్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సందీప్‌రాజ్


కోవిడ్ స‌మ‌యాల్లో ఓటీటీ మాధ్య‌మాలు సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు చేర‌వేయడంలో కీల‌క‌భూమిక‌ను పోషించాయి. ఆ కోవ‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ‘క‌ల‌ర్‌ఫొటో’. ఈ చిత్రంతో క‌మెడియ‌న్ సుహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తే శ‌రీర రంగు, దాని చుట్టూ తిరిగే క‌థ అని చూస్తేనే తెలుస్తుంది. మ‌రి ఇలాంటి ప్రేమ‌క‌థ‌తో సుహాస్ హీరోగా స‌క్సెస్ అందుకున్నాడా?  లేదా? అనే విష‌యం తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం....


క‌థ‌:

మచిలీప‌ట్నం ద‌గ్గ‌ర ఓ ప‌ల్లెటూరులో పాలుపోసి జీవ‌నం సాగించే కుర్రాడు జ‌య‌కృష్ణ‌(సుహాస్‌). ఇంజ‌నీరింగ్‌లో సీటు సంపాదిస్తాడు. ఓ సంద‌ర్భంలో త‌న క్లాస్‌మేట్ దీప్తివ‌ర్మ‌ను చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ జ‌య‌కృష్ణ న‌ల్ల‌గా ఉండ‌టంతో త‌న ప్రేమ‌ను దీప్తి అంగీక‌రిస్తుందో లేదోన‌ని భ‌య‌ప‌డుతుంటాడు. ఆ స‌మ‌యంలో దీప్తినే జ‌య‌కృష్ణ‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంది. ఆ త‌ర్వాత కాలేజీలో జ‌రిగే ప‌రిణామాల‌తో జ‌య‌కృష్ణ‌, దీప్తిల ప్రేమ గురించి.. దీప్తి అన్న‌య్య రామ‌రాజు(సునీల్‌)కు తెలుస్తుంది. జ‌య‌కృష్ణ న‌ల్ల‌గా ఉండ‌టం రామ‌రాజుకి న‌చ్చ‌దు. దాంతో వారిద్ద‌రినీ విడ‌దీస్తాడు. వారు ఓ ప్లాన్ వేసి క‌లుసుకుంటారు. అప్పుడు రామ‌రాజు ఏం చేస్తాడు?  జ‌య‌కృష్ణ‌, దీప్తి క‌లుసుకుంటారా?   చివ‌రికి వీరి ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపు తిరుగుతుంద‌నే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స‌మీక్ష‌:

‘మ‌నం ప్రేమించిన వ్య‌క్తిని మంచి స్థానంలో ఉంచ‌డ‌మే నిజ‌మైన ప్రేమ ల‌క్ష్యం’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్ర‌మే ‘క‌ల‌ర్‌ఫొటో’. సాధారణంగా ప్రేమకథలకు ఆస్థులు-అంత‌స్థులు, కులాలు, మ‌తాలు, డ‌బ్బు అంతరంగా ఉంటాయి. కానీ తొలిసారి ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్ శ‌రీర రంగు ప్రేమ‌కు అడ్డు వ‌స్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ‘క‌ల‌ర్‌ఫొటో’ అనే క‌థ‌ను రాసుకున్నాడు. అంతే కాకుండా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి 1997 బ్యాక్‌డ్రాప్‌ను కూడా ఎంచుకున్నాడు. కానీ సినిమాను అటు ఇటు తిప్పి చెప్పిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా హీరో, త‌న సీనియ‌ర్స్‌తో ఎలా గొడ‌వ‌ప‌డ్డాడు, త‌న లెక్చ‌ర‌ర్‌తో ఎలా గొడ‌వ‌ప‌డ్డాడు. అది కూడా త‌న శ‌రీర రంగు గురించి అనే పాయింట్ చుట్టూనే క‌థ‌ను ర‌న్ చేశారు. ఇంట‌ర్వెల్ ముగుస్తుంద‌న‌గా హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్‌ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఈ ల‌వ్ ట్రాక్ కూడా అంత ఎమోష‌న‌ల్‌గా, క‌నెక్టివ్‌గా అనిపించ‌దు. సినిమా పాయింట్ బాగానే ఉన్నా.. దాన్ని ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. క‌థ‌ను సాగ‌దీసినట్లుగా క్లియ‌ర్‌గా తెలుస్తుంది. సాంకేతికంగా చూస్తే కాల‌భైర‌వ సంగీతం, నేప‌థ్య సంగీతం బాగా ఉంది. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. ఫ‌స్టాఫ్ డైరెక్ట‌ర్ కామెడీ ట్రాక్‌ను న‌మ్ముకుని సినిమాను తెర‌కెక్కించాడు కానీ.. అది అంత పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే సుహాస్ త‌న పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. చాందిన చౌద‌రి కూడా చ‌క్క‌గా న‌టించింది. ఇక సునీల్ పాత్రకు త‌గ్గ న్యాయ‌మే చేశాడు.


బోట‌మ్ లైన్‌:  వెలిసిపోయిన ‘క‌ల‌ర్’ ఫొటో

రేటింగ్:  2.5/5



Updated Date - 2020-10-24T04:47:45+05:30 IST