కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి
ABN , First Publish Date - 2022-01-12T10:46:38+05:30 IST
నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈనెల 14న విడుదల అవుతోంది...
 
                            
నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈనెల 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీహర్ష మాట్లాడుతూ ‘‘హుషారు’ తరవాత దిల్ రాజుగారు పిలిచారు. ‘ఏదైనా ఓకాలేజ్ స్టోరీ ఉంటే చెప్పు’ అన్నారు. నా అనుభవాల నేపథ్యంలో ఓ కథ రాసుకున్నా. అది వినిపించా. ఆయనకు బాగా నచ్చింది. అదే ఇప్పుడు ‘రౌడీ బాయ్స్’ గా రూపుదిద్దుకుంది. కథ రాసుకుంటున్నప్పుడు ఎవరినీ దృష్టిలో ఉంచుకోలేదు. ‘ఆశిష్ హీరోగా ఎలా ఉంటాడు’ అని అడిగినప్పుడే నేను తనకి కనెక్ట్ అయిపోయా. తను బాగా నటించాడు. డాన్సులు కూడా బాగా చేశాడు. ప్రతి ఒక్కరికీ తమ కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చేలా ఈచిత్రాన్ని రూపొందించామ’’న్నారు.