IMP vs Masooda: మారేడుమిల్లి ప్రజానీకానికి ‘మసూద’ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-30T19:20:39+05:30 IST

ఈ దసరా పండుగకి మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), కింగ్ నాగార్జున (King Nagarjuna)లు వారి చిత్రాలతో పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. చిరంజీవి..

IMP vs Masooda: మారేడుమిల్లి ప్రజానీకానికి ‘మసూద’ హెచ్చరిక

ఈ దసరా పండుగకి మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), కింగ్ నాగార్జున (King Nagarjuna)లు వారి చిత్రాలతో పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ (God Father)తోనూ, నాగ్ ‘ది ఘోస్ట్’ (The Ghost)తోనూ దసరా బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా.. ఇంకో నాలుగైదు సినిమాలు కూడా అక్టోబర్ 5న విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాల తర్వాత మళ్లీ స్టార్ హీరోల సినిమాల మధ్య ఫైట్ జనవరిలో ఉండబోతోంది. ఈలోపు చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాలు దాదాపు ఓ 20 వరకు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో అల్లరి నరేష్ (Allari Naresh) నటిస్తోన్న వైవిధ్యభరిత చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఈ సినిమా.. టైటిల్‌తోనే ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేసింది. అలాగే ఫస్ట్ లుక్ తర్వాత సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. కామెడీని పక్కనెట్టి.. సీరియస్ రోల్స్ చేస్తున్న అల్లరి నరేష్.. ఈ సినిమాతో తనలోని డిఫరెంట్ షేడ్‌ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడనేలా ఇప్పటికే టాక్ ఉంది. అయితే ఈ చిత్రానికి హెచ్చరిక అనేలా.. ఆ సినిమా రిలీజ్ రోజే మరో సినిమా వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే జానర్‌లో తెరకెక్కుతుండటం గమనార్హం.


‘మళ్లీ రావా’ (Malli Raava), ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) వంటి చిత్రాలతో విజయవంతమైన బ్యానర్‌గా పేరొందిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Swadharm Entertainment)లో ‘మసూద’ (Masooda) అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందీ అంటే.. అందులో కచ్చితంగా ఢిపరెంట్ సబ్జెక్ట్ ఉంటుందనేలా.. మొదటి రెండు చిత్రాలతోనే ప్రేక్షకులలో ఆ బ్యానర్ పేరు సంపాదించుకుంది. ఈ సినిమాని నవంబర్ 11న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. హారర్ డ్రామాగా తెరకెక్కిందీ చిత్రం. రెండు సినిమాలు ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘మసూద’ టీజర్స్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్నాయి. రెండు సినిమాలు కూడా దాదాపు ఒకే తరహా కాన్సెప్ట్‌తో ఉండబోతున్నట్లుగా టీజర్స్ క్లారిటీ ఇవ్వడంతో.. ఈ రెంటిలో ఫైనల్‌గా ఏ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2022-09-30T19:20:39+05:30 IST