కోవిడ్‌తో క్రిటికల్ కండీషన్‌లో శివశంకర్ మాస్టర్

శివశంకర్ మాస్టర్ పరిచయం అక్కరలేని పేరు. కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్న శివశంకర్ మాస్టర్ ఇప్పుడు కోవిడ్‌తో క్రిటికల్ కండీషన్‌లో ఉన్నారు. నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. 


ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌తో చికిత్స పొందుతున్నారని, రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో.. అంత మొత్తం భరించే శక్తి తమ వద్ద లేదని.. ఇండస్ట్రీ వర్గాల నుండి ఏదైనా కొంత సాయం కావాలని శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ కృష్ణ కోరుతున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.