సెట్లో చిరు...

యువ కథానాయకుల కంటే జోరుగా సినిమాలు చేస్తున్నారు అగ్ర హీరోలు. ఈ జాబితాలో అందరికంటే ముందుండే పేరు... చిరంజీవి. ‘ఆచార్య’ పని పూర్తవుతుండగానే, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ చిత్రాల్ని మొదలెట్టారు చిరు. ఇప్పుడు మరో చిత్రాన్నీ పట్టాలెక్కించేశారు. చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబి దర్శకుడు. గురువారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. తొలి రోజు చిరంజీవిపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.