పాతిక భాషల్లో చిరంజీవి వెబ్‌సైట్‌

ABN , First Publish Date - 2021-10-19T06:34:20+05:30 IST

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ను రామ్‌చరణ్‌ సోమవారం ప్రారంభించారు. అలాగే చిరంజీవి సినిమాల విశేషాలు...

పాతిక భాషల్లో చిరంజీవి వెబ్‌సైట్‌

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ను రామ్‌చరణ్‌ సోమవారం ప్రారంభించారు. అలాగే చిరంజీవి సినిమాల విశేషాలు, ఆయన నిర్వహించిన సేవాకార్యక్రమాలను తెలిపేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కెచిరంజీవి.కామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘20ఏళ్లకు పైగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకప్పుడు నాన్నగారిని కలుసుకున్న అభిమానులకు ఫొటోలు ఇచ్చేవారు. అయితే వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో రక్తదానం చేసిన వారికి ఫొటో ఇస్తానని చెప్పారు. దాంతో చాలామంది అభిమానులు బాగా సపోర్ట్‌ చేశారు. నాన్నగారు, అరవింద్‌గారు క్రమంగా ఈ ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు. సేవా కార్యకమ్రాలను మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందించేందుకు పాతిక భాషల్లో వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. ఆక్సిజన్‌, రక్తం అవసరమైన వారు, రక్తదానం, నేత్రదానం చేయాలనుకున్నవారు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రతించవచ్చు. అలాగే హైదరాబాద్‌ బయట పలు ప్రాంతాల్లో రక్తదానం చేసేందుకు వీలుగా ఆఫీసులు ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. 


‘‘గతంలో నాన్నగారిపై చాలామంది అభిమానులు వెబ్‌సైట్స్‌ ప్రారంభించారు. అయితే అధికారికంగా ఆయన సినిమాల వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కెచిరంజీవి.కామ్‌ ద్వారా తెలుసుకోవచ్చు’’ అని చరణ్‌ చెప్పారు. నటుడిగా ఆయన పడ్డ ఇబ్బందులు, సాఽధించిన విజయాలు, ఆయన జర్నీ, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను ఇందులో పొందుపరిచామన్నారు.

Updated Date - 2021-10-19T06:34:20+05:30 IST