మెగాస్టార్ ఆల్ టైమ్ రికార్డ్

ABN , First Publish Date - 2021-12-07T16:16:34+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆయన ఎన్నడూ లేని విధంగా స్పీడ్ చూపిస్తూ.. యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీదుండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ.. ఆపై షూటింగ్ ను కూడా మొదలుపెడుతూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరు సరికొత్త రికార్డు కు తెరతీశారు. చిరంజీవి ప్రస్తుతం ఏకకాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇది ఇంతవరకూ ఏ హీరో కూడా సాధించని ఘనత.

మెగాస్టార్ ఆల్ టైమ్ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి ఆయన ఎన్నడూ లేని విధంగా స్పీడ్ చూపిస్తూ.. యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీదుండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ.. ఆపై షూటింగ్ ను కూడా మొదలుపెడుతూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరు సరికొత్త రికార్డు కు తెరతీశారు. చిరంజీవి ప్రస్తుతం ఏకకాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇది ఇంతవరకూ ఏ హీరో సాధించని ఘనత. కొరటాల శివ ‘ఆచార్య’, మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో 154వ సినిమా, మెహర్ రమేశ్ ‘భోళాశంకర్’ సినిమాల్ని చిరు సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇన్నేళ్ళ చిరు కెరీర్ లో ఏక కాలంలో పలు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఒకే ఏడాది నాలుగు అంతకన్నా చిత్రాల్ని విడుదల చేసిన దాఖలాలున్నాయి. అయితే ఒక్క డిసెంబర్ నెల్లోనే నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొని ఒకే నెల్లో అత్యధిక చిత్రాల షూటింగ్స్ చేసిన స్టార్ గా చిరు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశారు.  


ప్రపంచంలో ఏ స్టారూ కూడా ఇలా ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనలేదు. గతంలో హీరో కృష్ణ రోజుకు మూడు షిఫ్ట్స్ లో పనిచేసి ఒకేసారి మూడు చిత్రాల్లో నటించారు. కానీ ఇలా నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనలేదు. యంగ్ ఏజ్ లో చిరు ఎప్పుడూ ఇన్ని సినిమాల్ని ఒకేసారి ట్రాక్ ఎక్కించలేదు. కానీ 60 ప్లస్ ఏజ్ లో మెగస్టార్ ఇలాంటి ఫీట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమే. ఈ ఏడాదే చిరు ఇంత స్పీడ్ మీదుంటే.. వచ్చే సంవత్సరం ఇంకెన్ని సినిమాలు లైన్ లో పెడతారో అనే ఆత్రుతతో అభిమానులున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ‘ఆచార్య’ చిత్రం విడుదల కాబోతోంది. తనయుడు రామ్ చరణ్ తో ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో తెరమీద కనిపించనుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 



Updated Date - 2021-12-07T16:16:34+05:30 IST