డబ్బింగ్‌ షురూ

ABN , First Publish Date - 2022-10-15T05:30:00+05:30 IST

‘గాడ్‌ఫాదర్‌’తో ఘన విజయాన్ని అందుకొని మంచి ఊపులో ఉన్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న మరో చిత్రం (మెగా 154- వర్కింగ్‌ టైటిల్‌) సంక్రాంతికి..

డబ్బింగ్‌ షురూ

‘గాడ్‌ఫాదర్‌’తో ఘన విజయాన్ని అందుకొని మంచి ఊపులో ఉన్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న మరో చిత్రం (మెగా 154- వర్కింగ్‌ టైటిల్‌) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. శుక్రవారం డబ్బింగ్‌ కార్యక్రమాలని పూజతో ప్రారంభించారు. దర్శకుడు బాబీ, చిత్రయూనిట్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంది. త్వరలోనే అభిమానులను అలరించే అప్‌డేట్‌ రాబోతోందని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌  ప్రచారంలో ఉంది. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. శ్రుతీహాసన్‌ కథానాయిక. రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2022-10-15T05:30:00+05:30 IST