God Father Trailer: నేనున్నంత వరకూ ‘ఆ’ కుర్చీకి చెద పట్టనివ్వను

ABN , First Publish Date - 2022-09-29T02:36:44+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). బాలీవుడ్ కండల వీరుడు..

God Father Trailer: నేనున్నంత వరకూ ‘ఆ’ కుర్చీకి చెద పట్టనివ్వను

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev) వంటి వారు కీలక పాత్రలలో నటించారు. దసరా స్పెషల్‌గా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బుధవారం అనంతపురంలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాతలు ‘గాడ్‌ఫాదర్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ప్రేక్షకులలో, అభిమానులలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉందో.. దానికి తెరదించుతూ ఈ ట్రైలర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకు ముందు వరకు మలయాళ చిత్రమైన ‘లూసిఫర్’ను చిరంజీవి ఎందుకు రీమేక్ చేస్తున్నాడనేలా కామెంట్స్ చేసిన వారందరికీ సమాధానం అన్నట్లుగా ఈ ట్రైలర్ ఉంది. (GodFather Trailer Review)


ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్లందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక.. అన్ని రంగులు మారతాయ్. నెక్ట్స్ సీఎం సీటులో కూర్చోవడానికి ఆల్ పాజ్‌బిలిటీస్ ఉన్న వ్యక్తి..’’ అంటూ.. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వాయిస్‌తో పొలిటికల్ హీట్‌‌ని చూపిస్తూ మొదలైన ఈ ట్రైలర్.. ‘ఓరేయ్.. అన్నయ్య వచ్చేసినాడో.. అన్నీ ఒగ్గేసి యెళ్లిపోండి’.. అనే డైలాగ్ తర్వాత అదిరేలా మెగాస్టార్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ‘ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మ్యాన్.. బ్రహ్మ’ అని చిరు పాత్రని పూరి పరిచయం చేశాడు. అనంతరం ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు..’ అంటూ చిరు చెప్పిన డైలాగ్, యాక్షన్ సన్నివేశాలు... ఈ ట్రైలర్‌కే హైలెట్స్. ఆ తర్వాత ప్రజంట్ టాలీవుడ్ టాప్ ఛైర్ కోసం పోటీ పడే వారికి.. అది ఇంకా నాదే అనేలా.. ‘నేనున్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను..’ అని చిరు పలికిన డైలాగ్, చెప్పిన తీరు.. ఫ్యాన్స్‌తో ఈలలు వేయించడం ఖాయం. ‘నిన్ను కాపాడటానికి ఎవడున్నాడ్రా బచ్చా..’ అని సత్యదేవ్‌ని చిరు అనే డైలాగ్‌తో..  చిరుకి పోటీగా సత్యదేవ్ ఏంటి? అని చర్చలు జరిపేవారికి తగిలేట్టు చేశారు. ఇంకా నయనతార ‘మా పార్టీ ఆ బ్రహ్మ వెనుక నిలబడదు..’ అని చెప్పడం, సల్మాన్ ఖాన్ మాస్ ఎంట్రీ, సముద్రఖని పీకపై చిరు కాలు పెట్టడం.. వంటి మాసివ్ సన్నివేశాలతో ట్రైలర్‌ని కట్ చేశారు. ఇక చివరిలో చిరు, సల్మాన్ మెషిన్ గన్స్ పట్టిన తీరు.. కమల్ ‘విక్రమ్’ సినిమాని తలపించేలా ఉంది. థమన్ మ్యూజిక్, కెమెరా హైలెట్ అనేలా ఉన్నాయి. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. మెగా ఫ్యాన్స్‌కి ఈ పండగకి చిరు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నాడనేది ఈ ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. కాగా, కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (God Father Trailer Talk)



Updated Date - 2022-09-29T02:36:44+05:30 IST