చిరంజీవి: అది అభిమానుల గొప్పతనమే!

ABN , First Publish Date - 2021-10-17T23:00:42+05:30 IST

కరోనా సమయంలో వేలమందికి ఆక్సిజన్‌ సరఫరా చేయగలిగాం అంటే వెనకుండి నడిపించింది మెగా అభిమానులే! సాయం పొందిన ప్రతి ఒక్కరూ సేవలందించిన అభిమానుల గురించి గొప్పగా చెబుతుంటే చాలా గర్వంగా ఉంది. ఆక్సిజన్‌ బ్యాంక్‌ మిషన్‌ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది అంటే ఆ క్రెడిట్‌ అభిమానులకే దక్కుతుంది’’ అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి: అది అభిమానుల గొప్పతనమే!

కరోనా సమయంలో వేలమందికి  ఆక్సిజన్‌ సరఫరా చేయగలిగాం అంటే వెనకుండి నడిపించింది మెగా అభిమానులే! సాయం పొందిన ప్రతి ఒక్కరూ సేవలందించిన అభిమానుల గురించి గొప్పగా చెబుతుంటే  చాలా గర్వంగా ఉంది. ఆక్సిజన్‌ బ్యాంక్‌ మిషన్‌ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది అంటే ఆ క్రెడిట్‌ అభిమానులకే దక్కుతుంది’’ అని చిరంజీవి అన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ క్రైసిస్‌లో ఆక్సిజన్‌ బ్యాంకుల్ని స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సేవలందించారు మెగాస్టాన్‌ చిరంజీవి. అన్ని జిల్లాల నుంచి మెగా అభిమాన సంఘాలు సంఘాల ప్రతినిధులు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకన్నారు. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్‌  బ్యాంక్‌  సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కరోనా కష్టకాలంలో కొంతమంది అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేదన చెందాను. ప్రసాద్‌– హిందూపురం, ఎర్రా నాగబాబు– అంబాజీపేట, రవి – కడప వీరందరినీ కోల్పోవడం బాధాకరం" అని తెలిపారు. 




అలా పుట్టిన ఆలోచన..

గొల్లపల్లి అనే  చిన్న ఊరులో కరోనాతో ఆక్సిజన్‌ అందక ఎక్కువమంది చనిపోయారని తెలిసింది. అది విని నా మనసు కదిలిపోయింది. ఏం చేయాలా అని కలత చెందాను. అప్పుడు ఆక్సిజన్‌ బ్యాంకు పెడదామని ఆలోచన పుట్టింది. కరోనా పరిస్థితిలో ఫ్యాన్స్‌ ముందుకు రాగలరా? వారిని రిస్క్‌లో పెట్టడం కరెక్టేనా అనిపించింది. అయినా నా పిలుపుతో అందరూ అండగా నిలవడం రెట్టింపు ఉత్సాహం వచ్చింది. అనుకున్నదే తడవుగా వారంలోనే ఆక్సిజన్‌ బ్యాంకుల్ని స్థాపించగలిగాం. ఈ సమయంలో తాను అండగా నిలుస్తానని నా ేస్నహితుడు శేఖర్‌ ముందుకొచ్చారు. తన విరామ సమయాన్ని ేసవా కార్యక్రమాలకు అంకితమిస్తానని మాటిచ్చారు. ఆయన్ను చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా నియమించాం. స్వామినాయుడు కూడా అతనితో కలిసి పని చేస్తారు.


ఎంతోమందికి ధైర్యం ఇచ్చాం...

కరోనా సమయంలో ఎంతోమందికి ధైర్యం ఇచ్చాం. ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాను. కాకపోతే ముగ్గురు అభిమానుల్ని కాపాడలేకపోవడం దురదృష్టం. అభిమానులటంతా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుని ేసవా కార్యక్రమాల్లో భాగమైనందుకు సైనికులుగా ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. అనుక్షణం అభిమానకు కృతజ్ఞుడిగా ఉంటా. 


ఆ క్రెడిట్‌ అభిమానులదే! 

సిలిండర్లు దొరక్క చాలా సవాళ్లు ఎదురయ్యాయి. దుబాయ్‌.. గుజరాత్‌.. వైజాగ్‌ లాంటి ప్రాంతాల్లో ఇండస్ర్టియల్‌ ఏరియాల్లో ఆక్సిజన్‌ని తయారు చేయించాం. 3000 పైగా సిలిండర్లు తయారు చేయించి.. వీలైనంత ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొన్నాం. కరోనాలో వేల ప్రాణాలను అభిమానులు కాపాడారు. సాయం పొందిన ప్రతి ఒక్కరూ మెగా అభిమానుల గురించి గొప్పగా చెబుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్‌ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం’’ అని చిరంజీవి తెలిపారు. 




Updated Date - 2021-10-17T23:00:42+05:30 IST