Chiranjeevi: లక్షలాది అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌!

ABN , First Publish Date - 2022-09-29T05:19:24+05:30 IST

‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ చిరంజీవి ట్వీట్‌ చేసిన ఈ డైలాగ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! ఓ రెండు మూడు రోజులపాటు ఈ డైలాగ్‌ మీదే చర్చ జరిగింది.

Chiranjeevi: లక్షలాది అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌!

‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ చిరంజీవి (Chiranjeevi)ట్వీట్‌ చేసిన ఈ డైలాగ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! ఓ రెండు మూడు రోజులపాటు ఈ డైలాగ్‌ మీదే చర్చ జరిగింది. ఇప్పుడు దానికి దీటైన డైలాగ్‌ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ (God father) ప్రీ రిలీజ్‌ వేడుకలో అభిమానుల ముందు చెప్పి ఉర్రూతలూగించారు.


‘‘రోడ్డు, ఇసుక, కొండలు, నీళ్లు, నేల. మధ్యం కాంట్రాక్ట్‌లు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కరు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచీ మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్‌ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందించాలన్న నిర్ణయం, తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు, ఏదైనా జరగకూడనిది జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబడ్దార్‌ అన్న డైలాగ్‌ను చిరంజీవి చెప్పారు. సెటైరికల్‌గా ఉన్న ఈ రెండో డైలాగ్‌పై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ డైలాగ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  (God father pre release event)


చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక అనంతపురంలో జరిగింది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే చిరంజీవి స్పీచ్‌ విన్నారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను  చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులంతా నన్ను గాడ్‌ ఫాదర్‌ అని అంటున్నారు. కానీ ఏ గాడ్‌ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఈ స్థితి, పరిస్థితిని కల్పించిన ప్రతి ఒక్క అభిమాని నాకు గాడ్‌ఫాదర్‌. చిరంజీవి వెనక ఎలాంటి గాడ్‌ఫాదర్స్‌ లేరని అంటుంటారు. ఇప్పుడు చెబుతున్నా.. నా వెనకాల లక్షలాది గాడ్‌ఫాదర్స్‌ ఉన్నారు. అభిమానులంతా నాకు గాడ్‌ఫాదర్సే. ఇది నా హృదయం నుంచి వచ్చిన మాట’’ అని అన్నారు. మోహన్‌రాజా (Mohan raja)దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 





Updated Date - 2022-09-29T05:19:24+05:30 IST